పుంగనూరుముచ్చట్లు:
విద్యార్థులు దోమకాటుతో జ్వరాల భారీన పడకుండ దోమతెరలు రక్షణ కల్పిస్తుందని మెడికల్ ఆఫీసర్ రమ్యకృష్ణ తెలిపారు. బుధవారం పట్టణంలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు దోమతెరలను ఆమె పంపిణీ చేశారు. డాక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిశుభ్రతను పాటించాలని, నీటిని కాచితాగడంతో పాటు ప్రతి రోజు సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు మూసివేసి దోమలు రాకుండ చేసుకోవాలన్నారు. అలాగే నిద్రించే సమయంలో దోమతెరలు వినియోగించడంతో దోమకాటు నుంచి రక్షణ దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధికారి గంగయ్య, ప్రిన్సిపాల్ అన్నపూర్ణ, హెల్త్ అసిస్టెంట్లు తేజోమూర్తి, సోమశేఖరాచారి, ఏఎన్‌ఎంలు శ్రీలత, జ్యోతి, ఆశకార్యకర్త భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
Tags:Distribution of mosquito nets to students