తాడేపల్లిముచ్చట్లు:
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్‌రెడ్డిని కలుసుకున్న పలు జిల్లాలకు చెందిన నాయకులు.
ఈ సందర్భంగా వైయస్.జగన్ ఏమన్నారంటే…
- పార్టీ కేడర్ అంతా కసితో గట్టిగా పోరాటం చేశారన్న వైయస్.జగన్.
- చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారు, వారికి కూడా బాగా అర్థమయ్యింది.
- 2024 ఎన్నికలతో పోలిస్తే వైయస్సార్‌సీపీ ఓటింగ్ శాతాలు పెరిగాయని వైయస్.జగన్ వెల్లడి.
- ఎన్నికల షెడ్యూలు దగ్గరనుంచి, ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు జరిగినా ఓటింగ్ శాతం పెరిగిందన్న వైయస్.జగన్.
- సజావుగా ఎన్నికలు జరిగి ఉంటే… వైయస్సార్‌సీపీకి అనుకూలంగా ఇంకా భారీగా ఓటింగ్ పర్సంటేజీ నమోదయ్యేది.
- ఇది బయటకు వస్తే, తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే చంద్రబాబు అరాచకాలు చేశాడు.
- ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారన్న వైయస్.జగన్.
- ఇవన్నీ దాటుకుని విజయాలు సాధించిన చోట కూడా అక్రమాలకు పాల్పడి, ఫలితాలు తారుమారు చేశారన్న వైయస్.జగన్.
- వైయస్సార్‌సీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ నిందలు మోపి, లేని అబద్ధాలు చెప్పి, ఈ ఎన్నికల్లో చేసిన అరాచకాలు, అక్రమాలను చంద్రబాబు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్న వైయస్.జగన్.
- ఇన్ని దుర్మార్గాలు చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరిట నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్న వైయస్.జగన్.
పార్టీ నాయకుల వ్యాఖ్యలు:
- మా రాజకీయ జీవితాల్లో ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎప్పుడూ చూడలేదన్న నాయకులు.
- ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది.
- ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు బదులు బౌన్సర్లు పెట్టి నడిపారని వెల్లడి.
- అభ్యర్థుల బంధువులను కిడ్నాప్ చేసి, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తెచ్చారు.
- ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్లు పేరిట చాలా వరకు వైయస్సార్‌సీపీ ఓట్లు తీసేశారు.
- లెక్కింపు కేంద్రాల్లో కరెంటు ఆపి మరీ ఫలితాలు తారుమారు చేశారు.
- వైయస్సార్‌సీపీ గెలిచిన చోట పదేపదే రీకౌంటింగ్‌లు చేసి, లెక్కలు తారుమారు చేశారు.
- వైయస్సార్‌సీపీ అడిగిన చోట రీకౌంటింగ్‌లు మాత్రం చేయలేదు.
- అధికార పార్టీకి అనుకూలంగా అదనపు బ్యాలెట్ పేపర్లు ఇచ్చి, వారిని గెలిపించేలా అక్రమాలు చేశారు.
- ఈ ఎన్నికల్లో చంద్రబాబు చేయించిన దాడుల కారణంగా గ్రామ గ్రామాన చంద్రబాబు బాధితులు ఉన్నారన్న పార్టీ నాయకులు.
Tags:A discussion on how the local elections were conducted.