విజయవాడముచ్చట్లు:
విజయవాడ బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న సొరంగ మార్గం ఇది.. దాదాపు 1092 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. మూడున్నర కిలోమీటర్ల పొడవులో రెండు సోరంగాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ సొరంగ నిర్మాణం వల్ల బెంగళూరు, కడప, విజయవాడ మీదుగా పోయే ఈ జాతీయ రహదారి విజయవాడ నుంచి బెంగళూరుకు 110 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా మూడు నుంచి నాలుగు గంటలు తగ్గుతుంది. ఇది వచ్చే ఏడాది జూన్ లేదా జూలై లోపల ప్రారంభోత్సవం చేస్తారు. కడప జిల్లాలోని పోరుమామిళ్ల , నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండలాల మధ్య ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి అయింది. లోపల పనులు జరుగుతున్నాయి..
Tags: Bengaluru to Vijayawada