తెలంగాణ ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల మార్కెట్ కుదేలైంది..!
తెలంగాణతో,పాటు ఆంధ్రప్రదేశ్‌లో కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోవడం పౌల్ట్రీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఒక గుడ్డు ధర రూ.3.50 నుండి రూ.4.50 మధ్య పడిపోవడం రైతులు, చిన్న వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో చికెన్ షాపుల బంద్ పిలుపు ఈ సంక్షోభాన్ని మరింత హైలైట్ చేస్తోంది.
చికెన్ బంద్ ప్రభావం
తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏప్రిల్ 1, 2026 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది.
గుడ్డు ధరలు ఎందుకు పడిపోయాయి..?
ఎగుమతులు నిలిచిపోవడం ప్రధాన కారణం
పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ దేశాలకు జరిగే గుడ్ల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల నుంచి రోజూ కోట్ల సంఖ్యలో గుడ్లు విదేశాలకు వెళ్తాయి.ఎగుమతులు ఆగిపోవడంతో ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్‌లోకి వచ్చాయి. ఫలితం సరఫరా ఒక్కసారిగా పెరిగి ధరలు కుప్పకూలాయి, వేసవి ప్రభావం ఎండల కాలంలో గుడ్లు తింటే శరీర వేడి పెరుగుతుందనే భావనతో వినియోగం తగ్గింది.
Tags: Egg Prices Go Haywire! Is This the Handiwork of Poultry Farms?