November 7, 2026
Explore
డాక్టర్‌ను ఇంటికి పిలిపించి లక్షల దోపిడీ..

డాక్టర్‌ను ఇంటికి పిలిపించి లక్షల దోపిడీ..

November 7, 2026 | Andhra Pradesh


‘మత్తు వదలరా’ నటి అతుల్య చంద్ర అరెస్ట్

కేరళ ముచ్చట్లు:

తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి బాగోలేదని చెప్పి.. అత్యవసర వైద్యం పేరిట ఓ వైద్యుడిని ఫ్లాట్‌కు రప్పించిన నటి అతుల్య, నటుడు బిబిన్

ఆ వైద్యుడు ఫ్లాట్‌కు వెళ్లగానే.. 12 మందితో కూడిన ముఠా అతడిని నిర్బంధించి, కుర్చీలో కూర్చోబెట్టి విచక్షణారహితంగా దాడి చేశారు

అనంతరం ఆ వైద్యుడి వద్ద ఉన్న రూ.3.5 లక్షల విలువైన ఐఫోన్, స్మార్ట్ వాచ్, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లాక్కున్న వైనం

తాము చెప్పినట్టు వినకపోతే.. అత్యాచారం కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడిన ముఠా

ఆ ముఠా నుంచి చాకచక్యంగా తప్పించుకొని.. కడవంతర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైద్యుడు

కేసు నమోదు చేసి.. నటి అతుల్య చంద్ర, నటుడు బిబిన్ సహా ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు..!

వైద్యుడిపై సినీ నటుల దాడి కేసులో ట్విస్ట్
డాక్టర్ మీద అత్యాచారం కేసు నమోదు

కేరళలోని కొచ్చిలో అత్యవసర వైద్యం పేరిట డాక్టర్‌ను ఫ్లాట్‌కు రప్పించి, దాడి చేసి, లూటీ చేసిన కేసులో బిగ్ ట్విస్ట్

తనకు మత్తు మందు ఇచ్చి లైంగికంగా వేధించారని నటి అతుల్య బంధువు ఫిర్యాదుతో డాక్టర్‌పై అత్యాచారం కేసు

అతుల్య బంధువుకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. ఆమెకు ఇంటి వద్దే వైద్యం అందేలాగా ఏర్పాట్లు

కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వైద్యుడు ఫ్లాట్‌కు వచ్చి.. వైద్యం అందించేవాడు

ఈ క్రమంలోనే మత్తు మందు ఇచ్చి తనను లైంగికంగా వేధించాడని నటి అతుల్యకు చెప్పింది బాధితురాలు

ఈ విషయం తన స్నేహితులు, నటుడు బిబిన్‌కు చెప్పగా.. డాక్టర్‌కు బుద్ధి చెప్పాలని అందరూ నిర్ణయించారు

ప్లాన్ ప్రకారం.. అత్యవసర చికిత్స పేరుతో ఫ్లాట్‌కు రప్పించి, దాడి చేసి, అతడ్ని లూటీ చేశారు

బాధితురాలికి రూ.25 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొని.. అతడ్ని వదిలేసినట్టు తెలిసింది

అయితే.. వాళ్లు తనని వదిలిపెట్టిన అనంతరం తనపై దాడి చేశారని నటి అతుల్య, నటుడు బిబిన్‌లపై డాక్టర్ ఫిర్యాదు

మరోవైపు.. బాధితురాలైన నటి అతుల్య బంధువు ఫిర్యాదు మేరకు డాక్టర్‌పై అత్యాచారం కేసు నమోదు

నిజానిజాలు వెలికి తీసేందుకు.. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Tags:Doctor summoned to a house and robbed of lakhs…