November 7, 2026
Explore
ఉత్కంఠ.. ఎవరి తీర్పు ఎటువైపు!

ఉత్కంఠ.. ఎవరి తీర్పు ఎటువైపు!

November 7, 2026 | Andhra Pradesh

సుండుపల్లిముచ్చట్లు:

సుండుపల్లి మండల వ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు ఇచ్చిన తీర్పు పలువురు నాయకుల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.

ఒక జడ్పీటీసీ స్థానంతో పాటు ఆరు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, మూడు ఎంపీటీసీ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థుల విజయం ఇప్పటికే ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే మిగిలిన మూడు స్థానాలైన రాయవరం, తిమ్మసముద్రం, భాగంపల్లి ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు, టీడీపీ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థుల మధ్య జరిగిన పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రజాతీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో మరికొద్ది గంటల్లో తేలనుంది. కూటమి అభ్యర్థులా? స్వతంత్ర అభ్యర్థులా? అన్నది తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Tags: Suspense… which way will the verdict go?