March 30, 2026
Explore
మిత్రదేశాలు, శతృదేశాల జాబితాను విడుదల చేసిన ఇరాన్!

మిత్రదేశాలు, శతృదేశాల జాబితాను విడుదల చేసిన ఇరాన్!

March 30, 2026 | Andhra Pradesh

ఇరాన్ ముచ్చట్లు:

ఈ దేశాలకు చెందిన నౌకల్ని హార్ముజ్ జలసంధి గుండా అనుమతిస్తామన్న ఇరాన్..

తమ మిత్రదేశాలకు మాత్రమే ఈ జలసంధి నుంచి నౌకల రవాణాకు అనుమతులు మంజూరు చేస్తామని ఇరాన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మిత్రదేశాలు, శతృదేశాల జాబితాను విడుదల చేసింది. ప్రధానంగా ఐదు దేశాల్ని మిత్రదేశాలుగా పేర్కొంది. వాటిలో ఇండియా కూడా ఉండటం విశేషం.

మిత్ర దేశాలు ఇవి..

ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్ దేశాల్ని మిత్ర దేశాలుగా పేర్కొంది. ఈ దేశాలకు చెందిన నౌకల్ని హార్ముజ్ జలసంధి గుండా అనుమతిస్తామని ఇరాన్ తెలిపింది. ఇప్పటికే రెండు నౌకలు బయల్దేరాయని వెల్లడించింది. అలాగే, బంగ్లాదేశ్ నౌకల్ని కూడా అనుమతిస్తామని చెప్పింది. ఈ దేశాలు ఇప్పటికే తమతో మాట్లాడాయని, తమతో సమన్వయం చేసుకుంటాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. భవిష్యత్తులోనూ ఈ దేశాలకు సహకారం అందిస్తామని, యుద్దం ముగిసిన తర్వాత కూడా సహాయం కొనసాగుతుందని ఆయన చెప్పారు. మిత్రదేశాలతోపాటు తాము అనుమతించేది లేని శతృదేశాల జాబితాను కూడా ఇరాన్ ప్రకటించింది.

శతృదేశాల జాబితాను…

ఈ జాబితాలో అమెరికా, ఇజ్రాయెల్, యుద్ధంతో సంబంధం ఉన్న కొన్ని గల్ఫ్‌ దేశాలు, యుద్ధంలో కీలక పాత్ర పోషించిన దేశాలతో సంబంధాలు కలిగి ఉన్న కూటమి దేశాలున్నాయి. ఈ దేశాలకు చెందిన నౌకల్ని అనుమతించబోమని అరాగ్చి స్పష్టం చేశారు.
ప్రస్తుతం తమ దేశం యుద్ధం చేస్తోందని, యుద్ధం సమయంలో శతృదేశాల నౌకల్ని అనుమతించబోమని, అయితే, ఇతరులకు మాత్రం అనుమతి ఉంటుందన్నారు. మిత్రదేశాల నౌకలు ఈ మార్గం గుండా వెళ్లాలన్నా తగిన నిబంధనలు పాటించాల్సిండే అని తెలిపింది.
[9:56 AM, 3/30/2026] Sathis Reporter: ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం

▪️HRA మిహాయింపు మరో నాలుగు నగరాలకు వర్తింపు.
▪️ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌పై STT పెంచనున్న కేంద్రం.
▪️ఏప్రిల్‌ 1 నుంచి పాన్ దరఖాస్తుకు ఓటర్‌ ఐడీతోపాటు
బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు సమర్పించాలనే నిబంధన.
▪️ఏప్రిల్ 1 నుంచి రైలుటికెట్ రద్దు నిబంధనలు వర్తింపు.

Tags: Iran Releases List of Friendly and Hostile Nations!