August 24, 2026
Explore
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

August 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని మేలుపట్లలో జరిగింది. సోమవారం పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.పట్టణంలోని మేలుపట్లకు చెందిన శ్రావణి(19) , గతంలో పెళ్లి జరిగింది. భర్త వదిలివేయడంతో ఆమె మరో యువకుడు గణేష్‌ ను వివాహం చేసుకుని జీవిస్తోంది. ఇలా ఉండగా భార్యభర్తలు గొడవ పడటంతో మనస్థాపానికి గురైన శ్రావణి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:Woman commits suicide due to family dispute