అమరావతిముచ్చట్లు:
వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని జింబాబ్వే స్టార్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ నిరూపించాడు.
40 ఏళ్ల వయసులో అద్భుతమైన సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టేలర్ ఈ ఘనత సాధించాడు.
దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అతడి బ్యాట్ నుంచి మరో టెస్టు శతకం నమోదైంది.
వయసు పెరిగినా తనలోని ఆటతీరు, పట్టుదల ఏమాత్రం తగ్గలేదని ఈ ఇన్నింగ్స్‌తో టేలర్ చాటిచెప్పాడు. అతడి అద్భుత ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Tags; Brendan Taylor makes a splash at age 40… a magnificent century in Tests!