పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోర్టు ఆవరణంలో ఈనెల 21న చెక్‌బౌన్స్ కేసుల అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్ తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర లీగల్ సర్వీసస్ అథారిటి ఆదేశాల మేరకు ఈనెల 21న కోర్టు ఆవరణంలో చెక్ కేసులు మాత్రం పరిష్కరిస్తామన్నారు. ఇందుకు సంబంధించి న్యాయవాదులు, వివిధ సంస్థల వారు తమ పరిధిలోని చెక్కు కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. అధిక సంఖ్యలో చెక్కు కేసులు పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
Tags: Adalat for cheque bounce cases on the 21st