అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించనున్నట్లు చెప్పారు. మదనపల్లెలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, పీలేరులో సంజయ్ గాంధీ డిగ్రీ కళాశాల, రాయచోటిలోని పాత ఎస్పీ కార్యాలయంలో బాక్సులను భద్రపరచనున్నట్లు తెలిపారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీటీవీ నిఘాతో పాటు మూడంచెల సాయుధ పోలీసు భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి, ప్రశాంతంగా ఓటు వేసిన ప్రజలకు ఎస్పీ అభినందనలు తెలిపారు.
Tags: MPTC and ZPTC polling concludes peacefully in Annamayya district