November 5, 2026
Explore
వైభవంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

వైభవంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

November 5, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సంద‌ర్భంగా ఉదయం 8.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివార్ల‌ను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ త‌రువాత ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.అనంత‌రం రాత్రి 7 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట‌ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ.శరత్, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో వ‌ర‌ల‌క్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూప‌రింటెండెంట్ హరికృష్ణ, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధ‌న‌శేఖర్, ఆల‌య అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


Tags:Pavitrotsavams for Sri Kalyana Venkateswara Swamy begin on a grand scale