November 5, 2026
Explore
ఉన్నట్టుండి వ్యాపారి ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ

ఉన్నట్టుండి వ్యాపారి ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ

November 5, 2026 | Andhra Pradesh

.. అరగంటలో ఊహించని ట్విస్ట్…ఉన్న డబ్బులు కూడా పాయే పాపం

సైబర్ లింక్స్ తో జాగ్రత్తగా ఉండాలి….

తెలియకుండా లింక్స్ ఓపెన్ చేస్తే..బ్యాంక్ ఖాతా లో డబ్బులు పోతాయి …

శ్రీ సత్యసాయి ముచ్చట్లు:

హిందూపురానికి చెందిన ఓ వ్యాపారికి బ్యాంకు ఖాతా పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది.

ఉన్నట్టుండి ఆయన ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ అయినట్లు కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఇంత భారీ మొత్తం తన ఖాతాలోకి ఎలా వచ్చిందో అర్థంకాక తల పట్టుకున్నారు.

అయితే ఆ ఆనందం, ఆశ్చర్యం ఎంతోసేపు నిలవలేదు.

కేవలం అరగంటలోనే ఖాతాలోని మొత్తం డబ్బు మాయమైపోయింది.

చివరకు తన ఖాతా లో సొంత డబ్బులు కూడా కనిపించకపోవడంతో బ్యాంకు అధికారులను, పోలీసులను ఆశ్రయించారు

తన ఖాతాలోకి అంత భారీ మొత్తం ఎలా వచ్చిందో.. ఆ తర్వాత ఉన్నట్టుండి మొత్తం నిల్వ ఎందుకు మాయమైందో తేల్చాలని ఆయన కోరుతున్నారు. రూ.వెయ్యి కోట్లు తనకు అవసరం లేదని, కనీసం తన ఖాతాలో ఉన్న సొంత డబ్బులైనా తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం హిందూపురంలో ఈ వింత బ్యాంకు లావాదేవీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Tags: Rs 1,000 crore suddenly deposited into businessman’s account