November 3, 2026
Explore
బ్యాలెట్ కట్టల పరిశీలనలో అబ్జర్వర్

బ్యాలెట్ కట్టల పరిశీలనలో అబ్జర్వర్

November 3, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు:

మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మదనపల్లి మున్సిపాలిటీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోల్ అయిన బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలు కట్టే ప్రక్రియను కౌంటింగ్ సిబ్బంది చేపడుతున్నారు. ఈ ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ జి.బాలకృష్ణ పరిశీలించారు. ప్రతి టేబుల్ వద్ద కట్టలు సరిగా కడుతున్నారా, పింక్, వైట్ బ్యాలెట్ల వేర్పాటు సక్రమంగా జరుగుతోందా అని తనిఖీ చేశారు. లెక్కింపు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరిగేలా సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

Tags;Observer present during the examination of ballot bundles