November 3, 2026
Explore
ఫోర్జరీ కేసులో లేడీ డాన్ కోనేటి సులోచన తో పాటు మరో ఇద్దరికి రిమాండ్

ఫోర్జరీ కేసులో లేడీ డాన్ కోనేటి సులోచన తో పాటు మరో ఇద్దరికి రిమాండ్

November 3, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

ఫోర్జరీ కేసులో నీరు గట్టుపల్లెకు చెందిన లేడీ డాన్ రౌడీ షీటర్ కోనేటి సులోచనకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు టూ టౌన్ సీఐ గోపాల్ రెడ్డి తెలిపారు. మదనపల్లి నీరుగట్టువారి పల్లెకు చెందిన కోనేటి సులోచన, ఆమె ప్రధాన అనుచరులు రెడ్డప్పనాయుడు కాలనీకి చెందిన కడియాల శ్రీరాములు నాయుడు, గండి మోహన్ లను రెండో పట్టణ పోలీసులు మంగళవారం పిటి వారింటి పై తీసుకొచ్చి, అరెస్ట్ చేశారు. కోట్ల విలువైన భూములను ఫోర్జరీ ద్వారా కబ్జా చేశారన్న ఆరోపణలపై మార్పూరి శ్రీరామ్ ఫిర్యాదుతో ఇటీవల ఫార్జరీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను పీటీ వారెంట్ పై తెచ్చి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారని సీఐ తెలిపారు.

Tags: ‘Lady Don’ Koneti Sulochana and two others remanded in forgery case