బి.కొత్తకోట ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గోళ్ళతోపు సమీపంలోని కూనితోపు, పెద్దపల్లి వద్ద మంగళవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బి.కొత్తకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలా లేక ఇతర కారణాలా అనే కోణంలో విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Brutal murder of a young man in B. Kothakota