November 3, 2026
Explore

అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్

November 3, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను మంగళవారం అధికారులు తెరిచారు.

మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి అబ్జర్వర్లు, అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో సీల్స్ పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించారు. దీంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి అధికారులు సన్నద్ధమయ్యారు. కౌంటింగ్ ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Tags:Strong room opened in the presence of officials