మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న మదనపల్లి మున్సిపాలిటీ కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పరిశీలించారు.కౌంటింగ్ హాళ్ల వద్ద, స్ట్రాంగ్ రూం పరిసరాల్లో, ప్రధాన గేటు వద్ద భద్రతా సిబ్బంది విధులను ఆయన పరిశీలించారు. అభ్యర్థులు, ఏజెంట్ల తనిఖీలు, అనుమతి లేని వ్యక్తుల నియంత్రణపై పోలీసులకు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
Tags:Inspection of security arrangements at the counting center