March 29, 2026
Explore
కృష్ణ చైతన్య ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు.

కృష్ణ చైతన్య ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు.

March 29, 2026 | Andhra Pradesh

నెల్లూరుముచ్చట్లు:

నెల్లూరులో కృష్ణ చైతన్య ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి , ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిదులుగా హాజరై.. జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం కృష్ణ చైతన్య పిజీ కళాశాలలో విద్యార్థులు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలను గురించి కళాశాల సిబ్బంది వివరించారు..

యూనివర్సిటీ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అతిధులు.. డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి ,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించి.. గోల్డ్ మెడల్స్ అందజేశారు.

ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి ని, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించారు.

  • కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలను.. ఎంతో అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగిందని కృష్ణ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి తెలిపారు.
  • కృష్ణ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు.. అద్భుత ఫలితాలు సాధిస్తూ.. టాప్ MNC కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
  • కళాశాల అధ్యాపక సిబ్బంది అందిస్తున్న ప్రోత్సాహంతోనే.. విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు అందుకుంటున్నారన్నారు.
  • కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల NAAC అక్రిడేషన్ పొందడమే కాకుండా.. అటానమస్ హోదా దక్కించుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు.
  • 18 సంవత్సరాల నుంచి కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల యూనివర్సిటీ స్థాయిలో మొదటి 10 ర్యాంకులను సొంతం చేసుకోవడం ఎంతో గర్వకారణమని తెలిపారు.
  • రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య విద్యాసంస్థలను మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్తామని తెలిపారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్
  • కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
  • మొదట కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలను ప్రారంభించినప్పటి నుంచి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు అందుకుంటూ.. ఉద్యోగ అవకాశాలు సాధిస్తుండడం అభినందనీయమని తెలిపారు.
  • ఇటీవల కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల మరియు కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలకు NAAC అక్రిడేషన్ దక్కడంతో పాటు .. అటానమస్ హోదాను సాధించడం.. కళాశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనం అన్నారు.
  • రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులకు అత్యుత్తమ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి.. వారి వారి జీవనోపాధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు.. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల డీన్ తమిదెల జ్యోతి , ప్రిన్సిపల్ ప్రసాద్ , కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్ లు రామాంజనేయులు రెడ్డి , సుధారాణి అధ్యాపక సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

Tags; Annual Day Celebrations of Krishna Chaitanya Institute of Science and Technology.