అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ ప్రారంభం
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఓటింగ్
ఏకగ్రీవాలతో ముందే ఆధిక్యం సాధించిన అధికార కూటమి
నవంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో వృద్ధులతో సహా ఓటు హక్కు పొందుతున్న విధానం
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 10,262 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, సుమారు 99.36 లక్షల మంది ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు.
Tags:Municipal polling begins in AP; voters line up in queues