October 31, 2026
Explore
మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ నిర్వాకం.

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ నిర్వాకం.

October 31, 2026 | Andhra Pradesh

మీర్‌పేట్ ముచ్చట్లు:

సీజ్ చేసిన నగదు, బంగారం దుర్వినియోగం.. తండ్రి వైద్య ఖర్చుల కోసమేనని వెల్లడి!

కానిస్టేబుల్‌పై కేసు నమోదు.. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్: ప్రజల సొత్తుకు రక్షణగా ఉండాల్సిన పోలీసు ఉద్యోగే.. పోలీసుల స్వాధీనంలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దుర్వినియోగం చేసిన ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

వివరాలు ఇలా ఉన్నాయి..

  • ఒక కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి రూ.1.70 లక్షలను అక్రమంగా బదిలీ చేసినట్లు గుర్తించారు.
  • సీజ్ చేసిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.12.37 లక్షలు పొందినట్లు విచారణలో వెల్లడైంది.
  • తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతుండటంతో వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.
  • ఈ క్రమంలోనే స్వాధీనంలో ఉన్న నగదు, బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.
  • ఇటీవలే కానిస్టేబుల్ తండ్రి మరణించినట్లు సమాచారం.
  • ఘటనపై కేసు నమోదు చేసిన మీర్‌పేట్ పోలీసులు కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల స్వాధీనంలో ఉన్న సాక్ష్యాధారాలకు.. సొత్తుకు భద్రత లేకపోతే ఎలా? అన్న ప్రశ్నలు ఈ ఘటనతో తలెత్తుతున్నాయి.

Tags;Misconduct by a constable at the Meerpet police station.