మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ శనివారం పరిశీలించారు.స్థానిక జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని, పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ ప్రసాద్ లతో కలిసి తనిఖీ చేశారు. ఆదివారం జరిగే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశించారు.
Tags:DIG inspects election arrangements in Madanapalle