ఏలూరు ముచ్చట్లు:
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ప్రియురాలు స్వప్న మృతి
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం :
పోలవరం మండలం తంగేడికొండ గ్రామానికి చెందిన స్వప్న (29) జంగారెడ్డిగూడెంలో అద్దె ఇంట్లో ఉంటూ.. స్థానికంగా ఓ బ్యాకరీలో పని చేస్తోంది. శుక్రవారం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా.. అదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో చొరబడి చాకుతో విచక్షణారహితంగా దాడి చేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు.
గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా.. తొలుత జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం ప్రాణాలు కోల్పోయింది. కాగా, జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద చికిత్స పొందుతున్న సమయంలో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీరప్రసాద్ బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. తనను ఇష్టపడిన వ్యక్తే చాకుతో పొడిచాడని స్వప్న పోలీసులకు వివరించారు. అయితే రామకృష్ణ, స్వప్న కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, అయితే ప్రస్తుతం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
Tags:Boyfriend Ramakrishna attacks his girlfriend with a knife and flees.