.. ప్రజల సమస్యలపై డి. చందు ఆరా!
సీపీఐ అభ్యర్థి డి. చందును గెలిపించండి.. నక్కబండలో కదం తొక్కిన ముస్లిం మహిళలు!
పుంగనూరు ముచ్చట్లు:
స్థానిక 11వ వార్డు పరిధిలోని నక్కబండ ప్రాంతంలో సీపీఐ అభ్యర్థి డి. చందు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రజా చైతన్యానికి వేదికగా నిలిచింది. నాయకులు, కార్యకర్తలు నక్కబండలోని ప్రతి ఇంటికీ వెళ్లి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, అంతర్గత రోడ్ల సమస్యలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “నేడు పుంగనూరు పట్టణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం సాధారణ ఎన్నికలు కావు; ఇది ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వానికి మధ్య జరుగుతున్న ధర్మయుద్ధం. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే సీపీఐ ప్రధాన ధ్యేయం” అని ఆకాంక్షించారు.
వార్డు సమగ్ర రూపురేఖలు మారాలన్నా, ప్రజల హక్కులు పరిరక్షించబడాలన్నా వినయపూర్వకంగా సీపీఐ అభ్యర్థి డి. చందుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను వేడుకున్నారు.ఈ ప్రచారంలో నక్కబండకు చెందిన ముస్లిం మహిళలు అత్యధిక సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి ముందు వరుసలో నిలబడి ప్రచారం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మతాలకూ, వర్గాలకూ అతీతంగా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా నిలుస్తున్న డి. చందు గారి నాయకత్వంపై ప్రజలకున్న అగాధమైన నమ్మకానికి ఈ ప్రచార ఘట్టం ప్రతీకగా నిలిచింది. ముస్లిం సోదరీమణులు ప్రతి ఇంటికీ తిరిగి సీపీఐ అభ్యర్థి డి. చందు గారిని గెలిపించాలని ఉత్సాహంగా పిలుపునిచ్చారు. నక్కబండలో ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ సాగిన ఈ ఇంటింటి ప్రచారం వార్డు రాజకీయాల్లో కొత్త విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది.ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా సీపీఐ నాయకుడు టి. జనార్ధన్, సీపీఐ నాయకులు మున్నా, వెంకటరమణ రెడ్డి, రమణా రెడ్డి, రామమూర్తి, శ్రీరాములులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అత్యధిక సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు.
Tags:CPI campaigns from house to house in Nakkabanda