October 30, 2026
Explore
చెప్పిన మాట వినట్లేదని.. కుమార్తెను హత్య చేసిన తల్లి

చెప్పిన మాట వినట్లేదని.. కుమార్తెను హత్య చేసిన తల్లి

October 30, 2026 | Andhra Pradesh

రంగారెడ్డి జిల్లా ముచ్చట్లు:

కొత్తూరు పురపాలక కేంద్రంలో కన్న కూతురిని తల్లి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది.

ఈ నెల 27న జరిగిన ఈ ఘటనపై షాద్‌నగర్‌ డీసీపీ శిరీష రాఘవేంద్ర వివరాలు వెల్లడించారు.

సువర్చల (14) అనే బాలికను ఫోన్‌ ఎక్కువగా వాడుతోందన్న కారణంతో తల్లి విజయలక్ష్మి గొంతు నులిమి చంపేసింది.

మొదట దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో హత్య అని తేలింది.

నిందితురాలు తన తప్పును అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:Mother murders daughter for not listening to her