అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అర్హులైన దివ్యాంగులు తప్పనిసరిగా ఈ నిబంధనలు తెలుసుకోవాలి.
ముఖ్యమైన కొత్త నిబంధనలు:
6 నెలల గడువు:
- స్లాట్ బుక్ చేసుకున్న వారు 6 నెలల్లోపు వైద్య పరీక్షలకు హాజరు కావాలి. లేకపోతే ఆన్‌లైన్‌లో వివరాలు రద్దవుతాయి.
సులభమైన ఓటీపీ విధానం:
- ఇకపై పాత ఐడీ తొలగింపు మరియు కొత్త స్లాట్ బుకింగ్ కోసం ఓటీపీ విధానం అమలు.
బుకింగ్ మార్గాలు:
- గ్రామ/వార్డు సచివాలయాలు, మీసేవ, AP సేవా పోర్టల్ మరియు మనమిత్ర వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు:
- ఆధార్ కార్డు, లింక్ అయిన మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, మునుపటి మెడికల్ రిపోర్టులు.
Tags:New rules for ‘Sadaram’ slot booking for persons with disabilities in AP