చిలకలూరిపేట ముచ్చట్లు:
“కూటమి ప్రభుత్వ అరాచకాలకు ప్రజలే బుద్ధి చెబుతారు”
చిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి విడుదల రజిని విస్తృతంగా పర్యటించారు. వార్డుల్లోని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చిలకలూరిపేట పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రౌడీయిజం, గుండాయిజం సంస్కృతిని ప్రవేశపెట్టారని విడుదల రజిని ఆరోపించారు. నామినేషన్ల విత్‌డ్రాల సమయంలో అర్ధరాత్రి వరకు అభ్యర్థులను బెదిరించి, ఊరు విడిచి వెళ్లాలని ఒత్తిడి తెచ్చి అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజాతీర్పుతో సంబంధం లేకుండా కేవలం దౌర్జన్యాలతోనే గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, కొత్త పెన్షన్లు, రైతులకు సంక్షేమం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను నిర్వీర్యం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కూడా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం:
ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అరాచకాలకు పాల్పడుతోందని, ప్రజలంతా ఇదంతా గమనిస్తున్నారని చెప్పారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అందించిన సంక్షేమం, అభివృద్ధిని గుర్తుంచుకొని, పట్టణ ఓటర్లంతా ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని రజిని తెలిపారు.
Tags:Former Minister Vidadala Rajini lashes out during the municipal election campaign in Peta