ఎన్టీఆర్ ముచ్చట్లు:
జి.కొండూరు మండలం పెనపాక వెళ్లే రహదారిపై శుక్రవారం ఉదయం ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 18 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సులోంచి సురక్షితంగా బయటకు తీసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:School bus carrying students overturns