ఒడిశాముచ్చట్లు:
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం, 214 అడుగుల ఎత్తైన గోపురంపై పతాకాన్ని మార్చే ఆచారం కొనసాగుతోంది.
‘చూనారా’ సేవకులు ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండానే నిత్యం గోపురంపైకి ఎక్కి పతాకాన్ని మార్చుతుంటారు.
ఒకవేళ ఈ ఆచారం ఒక్క రోజు విస్మరించినా, ఆలయాన్ని కొన్నేళ్ల పాటు మూసివేస్తారని భక్తులు నమ్ముతారు.
ఈ ఆచారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భక్తిభావంతో సాగే ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Tags;The sacred flag atop the Puri temple spire… do you know how it is changed?