October 30, 2026
Explore
నవంబరు 30న సర్ తుది ఓటర్ల జాబితా

నవంబరు 30న సర్ తుది ఓటర్ల జాబితా

October 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

గడువు పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘం

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది.

తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం శుక్రవారం నాడు తుదిజాబితా విడుదల చేయాల్సి ఉంది.

దాన్ని పొడిగిస్తూ నవంబరు 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

నోటీసులు, క్లెయిముల పరిష్కారానికి గడువును నవంబరు 2వ తేదీ వరకు పొడిగించింది.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పంపిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

Tags:Final electoral roll to be published on November 30