అమరావతిముచ్చట్లు:
ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా టీజర్ వివాదంలో చిక్కుకుంది. టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు చరిత్రను వక్రీకరించేలా ఉన్నాయని, స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన మనవడు చంద్రకుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఆయన మరోసారి తీవ్రంగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సినిమాల్లో చారిత్రక వ్యక్తులను చిత్రీకరించే సమయంలో వారి పాత్ర, పోరాటం, దేశానికి చేసిన సేవలకు తగిన గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. ‘ఫౌజీ’ టీజర్‌లోని సన్నివేశాలపై తన అభ్యంతరాలను తెలియజేస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా పంపించి, నేతాజీకి తగిన గౌరవం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Tags;Complaint filed with PM Modi regarding ‘Fauji’ teaser..