October 28, 2026
Explore
డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం

డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం

October 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరువు ఉపశమనం (డీఆర్) 3 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది.

ఈ పెంపు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినికుమార్ వైష్ణవ్ మీడియాకు వివరించారు. దేశవ్యాప్తంగా సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు కలిపి 1.16 కోట్ల మందికి పైగా దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ చెల్లిస్తారు. తాజాగా 3 శాతం పెంపునకు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు అందే మొత్తం పెరగనుంది. జూలై 1 నుంచి ఈ పెంపు అమలులోకి రానుండటంతో అప్పటి నుంచి చెల్లించాల్సిన బకాయిలపైనా స్పష్టత రావాల్సి ఉంది.

Tags:Cabinet approves DA hike