మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె-నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నామినేషన్ కేంద్రంలో మంగళవారం కలకలం చోటుచేసుకుంది.రాయచోటికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశాడు. ఉపసంహరణకు తుది గడువు సందర్భంగా దానిని ఉపసంహరించుకునేందుకు కేంద్రం వద్దకు వచ్చాడు.
విషయం తెలుసుకున్న సీఈఓ లక్ష్మీపతి ఆదేశాలతో సిబ్బంది ఫోటోలు తీస్తుండగా అభ్యంతరం చెబుతూ హంగామా చేశాడు. మీడియా రావడంతో ముఖం చాటేసుకుని బయటకు పరుగులు తీశాడు.
Tags: Commotion at the nomination withdrawal center