న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీలో సోమవారం 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో లోక్సభస్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, యువత ఆశయాలు, ఆకాంక్షలకు పార్లమెంటులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో చట్టసభలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశమై వారితో సంభాషించారు.
Tags:12th BRICS Parliamentary Forum held in Delhi