October 27, 2026
Explore
గాలివీడు జడ్పీటీసీ: ఉత్కంఠకు తెర

గాలివీడు జడ్పీటీసీ: ఉత్కంఠకు తెర

October 27, 2026 | Andhra Pradesh

గాలివీడుముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా గాలివీడు జడ్పీటీసీ అభ్యర్థి, టీడీపీ జిల్లా ఇంచార్జ్ సుగవాసి ప్రసాద్ బాబు మంగళవారం మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలోని నామినేషన్ కేంద్రంలో సీఈఓ లక్ష్మీపతికి పార్టీ అధిష్టానం ఇచ్చిన బీ-ఫారం అందజేశారు.దీంతో ఆయన బరిలో కొనసాగనున్నట్లు స్పష్టమైంది. అయితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కూడా ఇదే స్థానానికి నామినేషన్ వేశారు.నేటితో ఉపసంహరణ గడువు ముగియనుండగా, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఉపసంహరించు కుంటారా లేదా అన్న ఉత్కంఠ కూటమి శ్రేణుల్లో నెలకొంది.

Tags;Galiveedu ZPTC: A curtain for suspense