అమరావతిముచ్చట్లు:
పెన్షన్ల లబ్దిదారులకు బిగ్ అప్డేట్. నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ పెన్షన్ల పంపిణీ లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ముందుగానే పెన్షన్లు అందించాలని డిసైడ్ అయింది.
ఈ మేరకు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ముందు రోజునే నగదు డ్రా చేసుకొని సిద్దం కావాలని నిర్దేశించారు. ఇదే సమయంలో ఎన్నికల కారణంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా పంపిణీ చేసే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పంపిణీ చేస్తున్న పెన్షన్ల పైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెల 1వ తేదీ ఇంటి వద్దనే లబ్దిదారులకు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే, నవంబర్ 1వ తేదీన మున్సిపల్ పోలింగ్ జరగనుంది. దీంతో.. ఆ రోజున పంపిణీ చేసే పెన్షన్ల విధానంలో మార్పులు చేసారు. దీంతో.. ఈ నెల 30 నుంచి నవంబర్ 5 వరకు పంపిణీ కొనసాగనుండగా, మరికొన్ని చోట్ల అక్టోబర్ 31నే పంపిణీ చేపట్టాలని డిసైడ్ అయ్యారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందే ఈ పింఛను నగదును సకాలంలో అందించేందుకు సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, సూచనల మేరకు ఈ మార్పు చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు పింఛన్ల పంపిణీ కొనసాగించేలా నిర్ణయించారు.
ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు
సాధారణంగా ప్రతి నెలా నిర్ణీత తేదీల్లో లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు అందజేస్తారు. అయితే, ఈసారి ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని పంపిణీ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల విధులు, పోలింగ్ ఏర్పాట్ల కారణంగా పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి గ్రామ, వార్డు స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అర్హులైన లబ్ధిదారులకు నిర్ణీత వ్యవధిలో పింఛన్లు అందేలా సంబంధిత యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా, అదే సమయంలో పింఛనుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పంపిణీ నిర్వహించడం అధికారులకు కీలకంగా మారింది.
Tags;Key changes to pension distribution on November 1st; latest orders issued..!!