October 26, 2026
Explore
మదనపల్లెలో కొనసాగుతున్న నామినేషన్ల ఉపసంహరణ

మదనపల్లెలో కొనసాగుతున్న నామినేషన్ల ఉపసంహరణ

October 26, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్నలక్ష్మి తెలిపారు. మండలంలోని 27 సెగ్మెంట్లకు మొత్తం 109 నామినేషన్లు ఆమోదం పొందగా, 33 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయన్నారు. రిజెక్ట్ అయిన 33 మంది స్థానిక సబ్ కలెక్టర్ కు శనివారం, ఆదివారం అప్పీల్ చేయడంతో వారు పరిశీలించి తదుపరి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.
కాగా నామినేషన్ల ఉప సంహరణకు మంగళవారం మధ్యాహ్నం తుది గడువు కావడంతో ఎన్నికల అధికారి ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో ఉపసంహరణ ప్రక్రియ మదనపల్లి ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతోందని తెలిపారు.

Tags:Withdrawal of nominations continues in Madanapalle