అమరావతిముచ్చట్లు:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు, బిధానగర్లో జరగాల్సిన అంతర్జాతీయ సంతాల్ సదస్సును హఠాత్తుగా మరోచోటుకు మార్చడంపై మోదీ మండిపడ్డారు. మమతా బెనర్జీ అన్ని హద్దులు దాటారని విమర్శించారు. రాష్ట్రపతికి జరిగిన అవమానానికి ప్రభుత్వ యంత్రాంగానిదే బాధ్యత అన్నారు. ఇది సిగ్గుచేటు విషయమని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, గిరిజన వర్గాల సాధికారతపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి నైతికసైర్యాన్ని దెబ్బతీసేలా మమతా బెనర్జీ చర్య ఉందని ఆరోపించారు.
Tags: Bengal government has crossed all limits – PM Modi is angry