- రెండేళ్లు గడిచిన కంపెనీకి దొరకని అనుమతి
- వైఎస్సార్‌సిపి పాలనలో పారిశ్రామిక కారిడార్
-10 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి - వైఎస్సార్‌సిపి ప్రభుత్వానికి పేరొస్తుందనే దురాలోచన
- ఎమ్మెల్యే పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌ల కృషికి అడ్డంకులు
పుంగనూరుముచ్చట్లు:
కరువుకు కేరాఫ్‌గా ఉన్న పుంగనూరు అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అడ్డంకిగా మారింది. కర్నాటక సరిహద్దులో ఉన్న పుంగనూరు అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వివిధ రకాల కంపెనీలను పుంగనూరులో ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో పుంగనూరును అభివృద్ధి చేసేందుకు, నిరుద్యోగ సమస్య నిర్మూలించేందుకు రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లు కృషి చేసి పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి పుంగనూరును పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు చేశారు.
కంపెనీల ఏర్పాటు….
ఇందులో భాగంగా తొలి విడతలో శ్రీకాళహస్తి ఎలక్ట్రోస్టీల్ కంపెనీని 150 ఎకరాలలో ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఎంపి మిధున్‌రెడ్డి కృషితో పనులను ప్రారంభించి, కంపెనీ ఉత్పత్తులను గత ఏడాది ప్రారంభించారు. సుమారు 550 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించారు.
బస్సుల కంపెని….
జర్మనికి చెందిన పెప్పర్‌మోహన్ ఎలక్ట్రిక్ ట్రక్కులు, బస్సుల కంపెని ఏర్పాటుకు వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇందు కోసం 850 ఎకరాల భూసేకరణ చేపట్టారు. కంపెనీ యాజమాన్యం రూ.4,460 వేల కోట్లరూపాయలతో 10 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా బస్సుల ఫ్యాక్టరీ నిర్మిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు భూమిని పరిశీలించారు. 2027 సంవత్సరానికి 30 వేల బస్సులు, ట్రక్కులు మార్కెట్‌లోకి విడుదల చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ కంపెనీతో పాటు మరో 13 అదనపు కంపెనీలు ఏర్పాటు చేస్తున్నట్లు పెప్పర్‌మోషన్ సంస్థ పేర్కొంది. ఎంపి మిధున్‌రెడ్డి ఆధ్వర్యంలో పనులు చురుగ్గా చేపట్టారు.
వైఎస్సార్‌సిపి కి మంచిపేరు వస్తుందని….
బస్సుల ఫ్యాక్టరీకి అనుమతి ఇస్తే వైఎస్సార్‌సిపి ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న దురాలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం మంజూరుకు బ్రేక్ వేసింది. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గస్తున్నా బస్సుల ఫ్యాక్టరీ ఏర్పాటును ఎండమావిగా మార్చింది. ఈ రెండు ఫ్యాక్టరీలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి లకు మంచి పేరు వస్తుందని, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తే వైఎస్సార్‌సిపికి అండగా నిలుస్తారన్న దురాలోచనతో ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు కాకుండ తెలుగుదేశం చోట నాయకులు అడ్డంకులు సృష్టిస్తుండడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి …..
తెలుగుదేశం ప్రభుత్వంలో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోయిన వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పుంగనూరులో అనేక పరిశ్రమలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగులు ఎవరు వలసలు వెళ్లకుండ స్థానికంగా పని చేసుకునేలా ఉద్యోగాలు రూపొందిస్తాం . ఫ్యాక్టరీల ఏర్పాటులో వైఎస్సార్‌సిపి ప్రభుత్వ పనితీరును సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోయేలా పని చేస్తాం.

- పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు.


Tags: Eclipse Looms Over German Electric Bus Company