పుంగనూరుముచ్చట్లు:
మున్సిపల్ ఎన్నికలను స్వేచ్చ , ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. అలాగే స్ట్రాంగ్‌రూమ్‌తో పాటు పోలీంగ్ కేంద్రాలను పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాలను అడిగితెలుసుకున్నారు. నగరివీధిలో పోలీంగ్ కేంద్రాన్ని మార్చే విషయమై కలెక్టర్‌కు నివేదికలు పంపుతామన్నారు. ప్రజలు స్వచ్చంధంగా ఓటు వేసేలా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు సృష్టించిన, అల్లర్లు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈయన వెంట సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ అన్సర్‌బాష పాల్గొన్నారు.
Tags: Elections must be conducted peacefully – SP Dheeraj Kunubilli.