పుంగనూరుముచ్చట్లు:
దసరా ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అమ్మవార్లను శ్రీ అన్నపూర్ణేశ్వరిదేవి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. మంగళవారం పట్టణంలోని శ్రీభోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని, శ్రీవిరూపాక్షి మారెమ్మను వేపాకుతో అలంకరించారు. అలాగే బజారువీధిలో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవిని, తూర్పు మొగసాలలో గల శ్రీచాముండేశ్వరిదేవిని ప్రత్యేకంగా శ్రీ అన్నపూర్ణేశ్వరిదేవి అలంకారంలో కొలువుదీర్ఛారు. శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని వరాహస్వామి రూపంలోభక్తులకు దర్శనం కల్పించారు. అలాగే మండలంలోని చదళ్ల గ్రామంలో శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారిని మధురమీనాక్షి అలంకారంలో కొలువుదీర్చి , భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లకు పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.


Tags: Deities Adorned as Sri Annapurneshwari Devi