చదళ్లలో వైభవంగా శరవన్నవరాత్రి ఉత్సవాలు – 60కి పైగా జట్లతో ఎన్‌వీఆర్ క్రికెట్ కప్ పోటీలు..
పుంగనూరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా,పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి శరవన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మధుర మీనాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్. వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.అమ్మవారి ఆలయాన్ని వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన సువాసనభరిత పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి దంపతులు గణపతి పూజ, గణపతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం, పుణ్యాహవచనం,సప్తమాతృకల ఆరాధన, హోమాలతో పాటు శ్రీ చౌడేశ్వరి దేవి మూలమంత్ర హోమయాగం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మధుర మీనాక్షి దేవిగా ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించే తరహాలోనే శ్రీ చౌడేశ్వరి దేవికి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.భక్తులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Tags: Sri Chowdeshwari Devi adorned in the guise of Madhura Meenakshi…