కుప్పం ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వికాస్ మర్మత్ పై బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదైంది.
బెంగళూరులోని ఒక పబ్‌లో జరిగిన గొడవకు సంబంధించి ఐఏఎస్ వికాస్ మర్మత్ తన స్నేహితులతో కలిసి విధుల్లో ఉన్న పోలీసులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, వారిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి.
ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌తో పాటు అభయ్ ఉదయ్ సింగ్, నితీశ్, రోషన్‌లపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Criminal case registered against Kuppam IAS officer in Bengaluru.