October 13, 2026
Explore
రెండు ఆటోలు ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

రెండు ఆటోలు ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

October 13, 2026 | Andhra Pradesh

పెద్దమండ్యం ముచ్చట్లు:

పెద్దమండ్యం మండలం పాపేపల్లి క్రాస్ వద్ద మంగళవారం ఉదయం రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. పాల ఆటో ప్రయాణికుల ఆటోను ఢీకొనడంతో ప్రయాణికుల ఆటోలో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు క్షతగాత్రులను గుర్రంకొండ 108 అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Tags: Two auto-rickshaws collide; several sustain severe injuries.