October 13, 2026
Explore
కొలిక్కిరాని కూటమి చర్చలు

కొలిక్కిరాని కూటమి చర్చలు

October 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ పోస్టుల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంలో కూటమి పార్టీల చర్చలు కొలిక్కి రాలేదు. ఆ పోస్టులకు రిజర్వేషన్లు ఖరారైనందున.. అక్కడ ఏ పార్టీకి బలమైన అభ్యర్థులున్నారన్న దాన్నిబట్టి తదుపరి చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు.నిన్న సాయంత్రం చంద్రబాబు, మనోహర్, మాధవ్ దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ముఖ్యంగా పలు మేయర్, ఛైర్మన్ సీట్ల విషయంలో పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తన ప్రతిపాదనలను మనోహర్ ద్వారా టీడీపీకి పంపగా, సాధ్యాసాధ్యాలపై సీఎం చంద్రబాబు, పల్లా శ్రీనివాస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Tags: Alliance talks remain inconclusive