- రెండు ఓట్లతో ఫ్యాన్ తిరగాలి , జెండా ఎగురవేయాలి
- మున్సిపల్ ప్రజలకు పెద్దిరెడ్డి వినతి
పుంగనూరుముచ్చట్లు:
రానున్న మున్సిపల్ ఎన్నికల తరువాత ఆరు నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆపివేసిన పనులన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఎన్నికల పర్యటనను ఆయన ప్రారంభించారు. తొలుత హనుమంతరాయునిదిన్నెలోని శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి పర్యటనను ప్రారంభించారు. చెరువుకట్టపై గల హజరత్‌నూర్‌షావలిబాబా దర్గాలో చాదర్ సమర్పించి దువ్వ చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి పట్టణంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ప్రచారంలో ఆయనకు ప్రతి ప్రాంతంలోను మహిళలు నీరాజనాలు పలికారు. పార్టీ క్యాడర్, ప్రజలతో పెద్దిరెడ్డి వార్డులు వారిగా సమావేశాలు నిర్వహించారు. పిల్లలతో , వార్డు ప్రజలతో కలసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. వైఎస్సార్‌సిపి ఐడి కార్డులను పంపిణీ చేశారు. ఈ సంద్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ రెండన్నరేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపాలిటి అభివృద్ధికి ఒక్కపైస కూడ ఖర్చుచేయలేదని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన పనులన్ని మున్సిపల్ ఎన్నికలైన ఆరునెలల కాలంలో పూర్తి చేస్తామని మున్సిపల్ ప్రజలకు హామి ఇచ్చారు. ఈ సమావేశంలో బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి, బలిజసంఘ అధ్యక్షుడు పూలత్యాగరాజు, వెహోదలియార్ల సంఘ అధ్యక్షుడు మురుగప్ప, వెలమసంఘ నేతలు ఆవులఅమరేంద్ర, మునిరాజ, అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీం, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఆర్‌కె.రామకృష్ణ, ఎస్టీ సంఘ అధ్యక్షుడు మర్రిబాబు, ముస్లిం నేతలు కెఎస్‌ఏ ఇఫ్తికార్‌అలీ, ఇర్ఫాన్, యూసఫ్, నూర్, నయాజ్, అయాజ్, ఆసిఫ్, మిధున్‌యువసేన నేతలు రాజేష్, సురేష్, హేము, గాండ్ల సంఘ నేతలు జయకృష్ణ, ఆవుల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రెండు ఓట్లు వేయాలి…
మున్సిపల్ ఎన్నికల్లో రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తారని , ఒకటి కౌన్సిలర్‌కు, మరోకరి చైర్మన్‌కు, ఆరెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు వివరించారు. రెండు ఓట్లతో ఫ్యాన్ గిరగిర తిరగాలని, ప్రతి వార్డులోను వైఎస్సార్‌సిపి జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల నుంచి యుద్ధం ప్రారంభించి, జగన్‌ను రెండవ సారి ముఖ్యమంత్రిని చేసుకునే వరకు పోరాటం చేయాలని కోరారు.
ఆర్‌వోప్లాంట్లు మూసేశారు….
మున్సిపల్ ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు 16 ఆర్‌వోప్లాంట్లను కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మించామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్‌వోప్లాంట్లను మూసివేశారని మండిపడ్డారు. ప్రజలకు మంచినీరు ఇవ్వడంలో కూడ తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే పట్టణంలో వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మినహా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని ఆరోపించారు. హెచ్‌ఎన్‌ఎస్ కాలువ నీరు మున్సిపల్ ప్రజలకు ఇవ్వకుండ కుప్పంకు తరలిస్తుండటం బాధకరమన్నారు. పుంగనూరు ప్రజలకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని నిలధీశారు.




Tags; We will complete the stalled development works in the municipality within six months.