October 12, 2026
Explore
బాబు చేసే అప్పులు రూ.10 లక్షల కోట్లు అవుతుంది

బాబు చేసే అప్పులు రూ.10 లక్షల కోట్లు అవుతుంది

October 12, 2026 | Andhra Pradesh

-ఎన్నికల సూపర్‌-6 పత్తాలేదు.

  • అమరావతి ఒక్కటే అభివృద్ధి కాదు
  • జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం
  • పేదల ఖాతాలకు డబ్బులు ఇచ్చిన ఘనత జగన్‌దే
  • వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పుంగనూరుముచ్చట్లు:

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరెండున్నరేళ్ల కాలంలో రూ.4 లక్షల కోట్లు అప్పు చేశారని , మిగిలిన కాలానికి మరో రూ.6 కోట్లు అప్పు చేసి రూ.10 లక్షల కోట్లు ప్రజలపై అప్పు పెట్టాడని , రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2029 లో జరిగే ఎన్నికల్లో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి కావాలని , పేద ప్రజల ఖాతాలకు డబ్బులు వేసిన ఘనత జగన్‌దేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం తన నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాన్ని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయము, సయ్యద్‌నూర్‌షావలిబాబా దర్గా లో ప్రార్థనలు చేసి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ జరిగిన సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌-6 హామి ఒక్కటి కూడ నేరవేర్చలేదని మండిపడ్డారు. అమరావతి పేరుతో ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడైన ఒక్కరూపాయి ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశారా అంటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని పెద్దిరెడ్డి నిలధీశారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ప్రజల వద్ద ఓట్లు వేసుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్నాడని ఆరోపించారు. రెండన్నరఏళ్ల కాలంలో ఒక్కరూపాయి అయిన అభివృద్ధికి ఖర్చు చేశారా అంటు నిలధీశారు. ఎన్నికల కోసం డ్రామాలు వేస్తున్నాడని మండిపడ్డారు. పడమటి నియోజకవర్గాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంచినీటి ప్రాజెక్టులు మంజూరు చేశారని తెలిపారు. ఆప్రాజెక్టులను పూర్తికాకుండ అడ్డుకున్న ఘనత చంద్రబాబు అండ్‌కో దని ఆరోపించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ కాలువ ద్వారా నీరు వెళ్తున్న మదనపల్లె, పుంగనూరు చెరువులకు , సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకులకు నీరు వదలకుండ ఈ ప్రాంత వాసులపై కక్షసాధింపు ధోరణితో పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కరోన సమయంలో కూడ జగన్‌ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి సేవలు చేయడంతో పాటు, పేదలందరికి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి, ఆదుకోవడం జరిగిందని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనించి, స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని , తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఫృద్వీధర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

Tags; The debts incurred by Babu will amount to ₹10 lakh crore.