October 12, 2026
Explore
నవరాత్రి తొలి రోజు బాల త్రిపుర సుందరిదేవి అలంకారం

నవరాత్రి తొలి రోజు బాల త్రిపుర సుందరిదేవి అలంకారం

October 12, 2026 | Andhra Pradesh

  • ప్రత్యేక పూజలు

పుంగనూరుముచ్చట్లు:

దసరా ఉత్సవాలలో భాగంగా తొలి రోజు అమ్మవార్లను బాల త్రిపుర సుందరిదేవి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. సోమవారం పట్టణంలోని శ్రీభోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని, శ్రీవిరూపాక్షి మారెమ్మను, అలాగే బజారువీధిలో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవిని, తూర్పు మొగసాలలో గల శ్రీచాముండేశ్వరిదేవిని ప్రత్యేకంగా బాల త్రిపుర సుందరిదేవి అలంకారంలో కొలువుదీర్ఛారు. శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసినబొమ్మల కొలువు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లకు పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags; On the first day of Navaratri, the deity is adorned as Bala Tripura Sundari Devi.