– రౌడీషీటర్లు, అనుమానితులు, అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్..
- ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేలా ముందస్తు చర్యలు.
- చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచన.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలను కట్టుదిట్టంగా పరిరక్షించేందుకు పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రౌడీషీటర్లు, అనుమానితులు, గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వ్యక్తులకు పోలీసు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడడం, ప్రలోభాలకు గురిచేయడం, గొడవలు సృష్టించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టంగా సూచించారు.
ఎన్నికల సమయంలో హింస, బెదిరింపులు, అల్లర్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై ఆధారాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి పౌరుడు చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రత, స్వేచ్ఛాయుత ఎన్నికలు, శాంతిభద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేసారు.
Tags:Police take proactive measures to maintain law and order ahead of the elections.