కారు సీటు కింద విదేశీ బంగారం.. వెంబడించి పట్టుకున్న డీఆర్ఐ అధికారులు..!
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నం జాతీయ రహదారిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారులో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు.
కారును తనిఖీ చేయగా సీటు కింద దాచిన మూడు ప్యాకెట్లలో మొత్తం 5,832.90 గ్రాముల విదేశీ బంగారం కడ్డీలు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.8.98 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు అనే కోణాల్లో డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Gold worth ₹8.98 crore on Visakhapatnam highway!